Tomato rice .
బియ్యం - 2 కప్పులు (కడిగి నానబెట్టినవి)
* పుదీనా - 2 టేబుల్ స్పూన్లు (కట్ చేసినవి)
* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (కట్ చేసినవి)
* నెయ్యి - పావు కప్పు
* దాల్చిన చెక్క పొడి - 1/4 టీస్పూన్ లేదా చిన్న చెక్క వేసుకోవచ్చు..
* లవంగాలు - 4
* ఏలకులు - 2
* ఉల్లిపాయలు - అరకప్పు (తరిగినవి)
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
* టమాటాలు - 5 (ప్యూరీ చేసుకోవాలి)
* పచ్చిమిర్చి - 4
* ఉప్పు - తగినంత
* కొత్తిమీర - గార్నిష్ కోసం
టొమాటో రైస్ తయారీ విధానం
ముందుగా టొమాటోలను ఉడకబెట్టి.. బ్లెండర్లో వేసి ప్యూరీ చేయండి. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని.. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయండి. అనంతరం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించండి. అవి వేగాక.. దానిలో టమోటో ప్యూరీ వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి. బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిలో 3 కప్పుల నీరు వేసి మరిగించాలి. వేడిని తగ్గించి, మూతపెట్టి, ద్రవం అంతా పీల్చుకునే వరకు అన్నం ఉడికించాలి. అంతే వేడి వేడి టొమాటో రైస్ రెడీ. కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించేసుకోండి.
Comments
Post a Comment